రక్తాన్ని దానం చేసేవారే నిజమైన హీరోలు...
Ens Balu
3
Srikakulam
2020-08-16 17:45:28
ప్రముఖ సినినటుడు ,కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జన్మదినం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు నిర్వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం శ్రీకాకుళంలోని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం వద్ద మెగా రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెండ్ తైక్వాండో శ్రీను ఆద్వర్యంలో, శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు విశ్వక్ సేన్ సమక్షంలో జిల్లాలోని మెగా ఫ్యామిలీ అభిమానులంతా కలిసి ఈ మెగా రక్తదాన శిభిరంలో పాల్గోని స్వచ్చంధంగా రక్తదానం చేసారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు మాట్లాడుతూ చిరంజీవి స్ఫూర్తితో మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని మరింత ఉత్సాహంగా జీవించవచ్చన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున రక్తం కొరత ఉందని ఈ నేపధ్యంలో యువజనులు, మహిళలు అన్ని వర్గాల వారు ముందుకురావాలన్నారు. చిరంజీవి అభిమానులు స్వచ్చంధంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తుండడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన ప్రతిఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు.
అనంతరం రక్త దాతలకు పతకాలు , సర్టిఫికెట్లను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు విశ్వక్ సేన్ మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు ప్రతి ఏడాది మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా రెండవ రోజు మెగా ఫ్యామిలీ అభిమానులతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే జిల్లాలో చిరంజీవి అభిమాన సంఘాం అనేక సేవా కార్యక్రమాలు చేపడతున్నాయని ఆయన అన్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులు వారి అభిమాన హీరో జన్మదిన వేడుకకు సమాజ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు వైశ్యరాజు మోహన్ మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ఇచ్చిన స్పూర్తితో చిరంజీవి కుటుంబం మీద ఉన్న అభిమానంతో గత మూడు దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తితో విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్య, న్యూట్రిషనిస్ట్ నాగరాజు, రామ్ చరణ్ యువత అధ్యక్షుడు తైక్వాండో గౌతమ్, ఉపాధ్యక్షుడు నానిచరనిజం, కార్యదర్శి హరీష్ ఇతర సభ్యులు మదీనా, తేజ, చైతన్య సాయి, సిద్దు,హరీష్ బిందు సాగర్, చంద్ర శేఖర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అద్యక్షుడు పుక్కల నవీన్ ,తలాడ శేఖర్ , వెంకీ గణ, హేము బ్రౌన్, సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ , కిరణ్, కార్తీక్ ,ఖాదర్ , దుర్గా చిత్తూరి,రమేష్ చంటి వరుణ్ తేజ్ అభిమానులు సీర రుద్రరాజు, నాని , పెయ్యల చంటి, అంబేద్కర్, ఖాదర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.