ఏపీ తొలి ముఖ్యమంత్రికి ఘన నివాళి..


Ens Balu
3
Visakhapatnam
2021-02-14 21:26:23

ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత దామోదరం సంజీవయ్యకు జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ ఘనంగా నివాళులు అర్పించారు. దామోదరం సంజీవయ్య జన్మదినోత్సవం సందర్భంగా  జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్ర పటానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలక్టరు ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు డివి రమణమూర్తి, తదితర అధికారులు పాల్గొన్నారు.