ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలి..


Ens Balu
3
Anantapur
2021-02-15 14:10:58

ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం నగరంలోని పెన్నార్ భవన్ లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయం, జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెన్నార్ భవన్ లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ఆవరణంలో ఎలాంటి అపరిశుభ్రత ఉండరాదని, పరిసరాలను అందంగా ఉంచాలని, చెత్త ఉండకుండా చూసుకోవాలని ఏపిఈడబ్ల్యుసి మరియు సమగ్ర శిక్ష  ఈఈని ఆదేశించారు. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలపై ఉన్న రాతలను, పోస్టర్లను తొలగించాలని సూచించారు. వెల్ఫేర్ కు సంబంధించిన వివిధ పథకాల బొమ్మలను ప్రహరీ గోడలపై వేయించాలని ఆదేశించారు. అనంతరం వివిధ ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. కార్యాలయాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఈడబ్ల్యుసి మరియు సమగ్ర శిక్ష  ఈఈ శివకుమార్, బిసి వెల్ఫేర్ ఈ డి యుగంధర్, సోషల్ వెల్ఫేర్ డిడి విశ్వమోహన్ రెడ్డి, డిఎస్ డి ఈ శ్రీనివాస కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.