రాండమైజేషణ్ ద్వారా పోలింగ్ కేంద్రాలు..
Ens Balu
3
Vizianagaram
2021-02-15 20:17:50
విజయనగరం డివిజన్లో ఈ నెల 17న జరగనున్న పంచాయతి ఎన్నికల పోలింగ్ సిబ్బందికి 3వ రాండమైజేషణ్ ద్వారా సోమవారం పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఎన్.ఐ.సి లో వ్యయ పరిశీలకులు సందీప్ కృపాకర్, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఈ రాండమైజేషణ్ ద్వారా పోలింగ్ అధికారులు, అదర్ పోలింగ్ అధికారులు , రిజర్వు సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. 3వ దశ లో 9 మండలాల్లో జరగ నున్న 2402 పోలింగ్ కేంద్రాలకు గాను పి .ఓ లు, ఓ.పి.ఓలు కలిపి 5189 మందిని నియమించారు. మరో 309 మందిని రిజర్వు లో నియమించారు. వీరందరికీ వెంటనే ఉత్తర్వులను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 21 న 10 మండలాల్లో జరగనున్న 4వ దశ పంచాయతి ఎన్నికలకు సంబంధించి 2వ రాండమైజేషణ్ ద్వారా ఎన్నికల సిబ్బందికి మండలాలను కేటాయించారు.ఈ దశ లో 2793 పోలింగ్ కేంద్రాలకు గాను 6222 ని నియమించారు. మరో 342 మందిని రిజర్వ్ లో ఉంచారు. వీరందరికీ మండలాలను కేటాయించడం జరిగింది. 3వ రాండమైజేషణ్ ద్వారా వీరికి పోలింగ్ కేంద్రాలను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ డా. జి.సి. కిషోర్ కుమార్, సహాయ కలెక్టర్ సింహాచలం, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, రెవిన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్, డి.పి ఓ సునీల్ రాజ్ కుమార్, ఎన్.ఐ.సి డి.ఐ.ఓ నరేంద్ర , సహాయ అధికారి బాలసుభ్రమణ్యం, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.