PMGSY రోడ్లకు త్వరలో క్లియరెన్స్..
Ens Balu
1
Vizianagaram
2021-02-15 20:19:24
విజయనగరం జిల్లాలో పిఎంజిఎస్ వై క్రింద మంజురైన రహదారులకు సంబంధించిన అటవీ క్లియరెన్స్ లన్ని త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ సోమవారం శ్రీకాకుళం, విజయనగర, వైజాగ్, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పి ఎం జి ఎస్ వై రహదారుల పురోగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో 15 రహదారులు ఈ పధకం క్రింద మంజూరు కాగా పనులు పురోగతి లో ఉన్నాయని వివరించారు. అటవీ క్లియరెన్స్ కోసం కొన్ని పి సి సి ఎఫ్ వద్ద, మరి కొన్ని జాయింట్ ఇన్స్పెక్షన్ స్థాయి లోను పెండింగ్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18 నాటికీ ప్రతిపాదనలను పంపించడం జరుగుతుందన్నారు. అప్లోడ్ చేయవలసినవన్ని ఈ రోజే చేయడం జరుగుతుందన్నారు. అటవీ భూముల పరిహారం క్రింద ఇవ్వవలసిన భూమిని విజయనగరం, పాచిపెంట, కొమరాడ మండలాల్లో గుర్తించడం జరిగిందని, ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాద్, రెవిన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్, పంచాయతి రాజ్ ఎస్.ఈ గుప్త, ఈ ఈ విజయకుమార్ తదితరులుపాల్గొన్నారు.