ఏయూలో ఐదురోజుల ఐపిఆర్ శిక్షణ..
Ens Balu
1
Andhra University
2021-02-15 20:33:41
ఆంధ్రవిశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్(ఐపిఆర్‌ఎస్), డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డిపిఐఐటి) సంయుక్త నిర్వహణలో పేటెంటింగ్ విధానంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్‌ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. భారత ప్రభుత్వ కామర్స్, ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ, టర్న్ఐపి దీనికి సహకారం అందిస్తున్నాయి. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.‘ వేలిడేటింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫర్ పేటెంట్‌బులిటి యూజింగ్ గ్లోబల్ పేటెంట్ డేటాబేస్’ అంశంపై ఈ శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. ఏయూలో నెలకొల్పిన ఐపిఆర్ సెంటర్ నిర్వహిస్తున్న ఈ నూతన కార్యక్రమాన్ని వీసీ ప్రసాద రెడ్డి అభినందించారు. తద్వారా పేటెంట్‌లు పొందే విధానంపై విద్యార్థులకు, ఆవిష్కర్తలకు అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, డిపిఐఐటి-ఐపిఆర్ చెయిర్ ప్రొఫెసర్ డాక్టర్ హెచ్.పురుషోత్తం ,ఏయూ ఇంక్యుబేషన్ సెంటర్ సిఈఓ రవి, వైజాగ్ ఇండస్ట్రియల్ స్కాన్ సిఈఓ ఆదిత్య సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.