పాడేరు డివిజన్ ఎన్నికలకు పూర్తి సన్నద్దం..


Ens Balu
3
Visakhapatnam
2021-02-15 20:34:42

విశాఖ ఏజెన్సీలోని పాడేరు డివిజన్ లో ఈ నెల 17వ తేదీన జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు గావించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  సోమవారు ఉదయం  కలెక్టరు, 17వ తేదీన పాడేరులో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై  నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ పాడేరులో ఉదయం  6.30 నుండి మధ్యాహ్నం 1.30 గం ల వరకు జరుగు పోలింగ్ కు సిబ్బంది రవాణా కు బస్సులను ఏర్పాటు గావించాలన్నారు. అక్కడ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు,  సమస్యలను దృష్టిలో వుంచుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల డ్యూటీలు వేసిన సిబ్బంది డ్యూటీ వివరాలు,రవాణా ఏర్పాట్ల వివరాలను స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. సిబ్బంది రవాణా విషయములో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్సులు బయలుదేరు పాయింట్లు  : 1.ఎ.యు ఇంజనీరింగ్  కాలేజి, విశాఖ,  ఎన్.టి.ఆర్. స్టేడియం, 2 గవర్నమెంటు డిగ్రీ కాలేజి, చోడవరం  3. గుర్రప్ప కళ్యాణీ మండపం,యలమంచిలి. పై పాయింట్లు నుంచి బస్సులు  ఉదయం 4 గం .లకు బయలు దేరాలన్నారు. బస్సులపై ఎక్కడికి వెళ్లేది స్పష్టంగా కనపడే విధంగా స్టిక్కరింగ్ చేయాలన్నారు. పబ్లిక్ ఎడ్రస్ సిస్టమ్ ద్వారా వివరాలు  తెలియజేయాలన్నారు. అక్కడ సిబ్బందికి కాఫీ, టీ,స్నాక్స్, త్రాగునీరు, టయ్ లెట్స్, మెడికల్ క్యాంపు ఏర్పాట్లు గావించాలన్నారు. ఏజెన్సీ 11 మండలాల యం.పి.డి.ఒ.లకు ఏర్పాట్ల వివరాలను తెలియజేయాలన్నారు.  ఏజెన్సీ 11 మండలాల నుండి సిబ్బంది రవాణా వివరాలను కూడా తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు, పి.ఒ. ఐ.టి.డి.ఎ. నోడల్ అధికారులు , జెడ్ పి.సి.ఇ.ఒ., డి.పి.ఒ. లు పాల్గొన్నారు.