ఎన్నికల సిబ్బందికి 80 ప్రత్యేక బస్సులు..
Ens Balu
3
Visakhapatnam
2021-02-15 20:39:03
విశాఖజిల్లాలోని ఈనెల 17వ తేదీన పాడేరు డివిజన్ లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు హాజరయ్యే సిబ్బంది సౌకర్యం నిమిత్తం మంగళవారం 80 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు వెళ్లేందుకు ఎలమంచిలి, చోడవరం, నర్సీపట్నం ల నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఉచితంగా తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ నుండి 27 ఆర్టీసీ బస్సులు బయలుదేరుతాయన్నారు. విశాఖపట్నం అర్బన్, గాజువాక, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల నుండి వచ్చే వారు తెల్లవారు జామున 4-00 గం. ల నుండి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించారు. అదేవిధంగా అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల వారికి అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం నుండి చోడవరం, బుచ్చయ్యపేట, కే. కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, మండలాల వారికి చోడవరం బస్ స్టేషన్ నుండి ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల వారి సౌకర్యార్థం యలమంచిలి గురప్ప కళ్యాణ మండపం వద్ద నుండి బస్సులు జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట డుంబ్రిగుడ అరకు అనంతగిరి లకు వేర్వేరు రూట్లలో బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అనకాపల్లి నుండి అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల వారికి అరకు, అనంతగిరి మండలాలకు, ఎస్.కోట నుండి అనంతగిరి,అరకు, పాడేరు లకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు., ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిన ఆయన కోరారు.