హరిత విజయనగరానికి ప్రశంశ..
Ens Balu
1
Vizianagaram
2021-02-15 20:45:43
విజయనగరం జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ నేతృత్వంలో చేపడుతున్న పచ్చదనం పెంచే కార్యక్రమాల పట్ల రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి( విజిలెన్స్) డా. గోపీనాథ్ ఆసక్తి కనబరిచారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం చేపడుతూ అన్నీ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయడాన్ని ప్రశంసించారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయం సందర్శనకు వచ్చిన ఆయనకు జిల్లా సామాజిక అటవీ అధికారి జానకి రావు, హరిత విజయనగరం సమన్వయ కర్త రామ్మోహన్ సోమవారం కలసి జిల్లాలో చేపడుతున్న పచ్చదనం కార్యక్రమాలపై వివరించి జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఒక సచిత్ర నివేదిక నీ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్క్వాడ్ అటవీ అధికారి సూర్యనారాయణ పడాల్, సబ్ డి.ఎఫ్.ఓ. బి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.