నాడు-నేడు పనులు నాణ్యతతో చేపట్టాలి..
Ens Balu
7
Tirupati
2021-02-15 21:10:46
నాడు- నేడు క్రింద పాఠశాలలలో చేపడుతున్న పనులను నాణ్యత తో పూర్తి చేయాలని మరియు పాఠశాలలలో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష శాఖల ఆధ్వర్యం లో మనబడి, నాడు-నేడు కు సంబంధించి జిల్లాలో జరుగుతున్న పనులను ఇతర సంబంధిత అంశాలపై ముఖ్య కార్యదర్శి సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వెట్రి సెల్వి, ఎ.మురళి అడ్వైజర్ (infra), ఏ పి ఈ డబ్ల్యూ ఐ సి రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్ లతో కలసి సమీక్ష నిర్వహించగా జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీర బ్రహ్మం, కడప ఆర్జెడి వెంకట కృష్ణా రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ వెంకటరమణా రెడ్డి, డిఈఓ నరసింహారెడ్డి, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్సీలు అమర్నాథ్ రెడ్డి, విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ పద్మనాభం, ఎం ఈ ఓ లు, సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీర్లు సమీక్ష లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంక్షేమం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపు రేఖలను మార్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలలో భాగంగా నీటి వసతి తో కూడిన మరుగుదొడ్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు, త్రాగునీటి సరఫరా, స్టాఫ్ మరియు స్టూడెంట్స్ కు ఫర్నిచర్ ఏర్పాటు, పెయింటింగ్, మేజర్ మరియు మైనర్ రిపేర్స్, బ్లాక్ బోర్డ్స్, ఇంగ్లీష్ లాబ్స్, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుచున్నదని తెలిపారు. జిల్లాలో నాడు- నేడు కింద 1533 పాఠశాలలలో చేపట్టిన పనులు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. నాడు- నేడు క్రింద రెండవ దశలో చేపట్టే పనులను 2021 , ఏప్రిల్ 01 నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. నాడు - నేడు క్రింద చేపట్టే పనులను వేగవంతం చేసేందుకు సచివాలయాలలో గల ఇంజనీర్ లను భాగ స్వామ్యులను చేయాలని తెలిపారు. పాఠశాలల రూపు రేఖలను మార్చి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహణ జరిగేలా మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుచున్నదని తెలిపారు. నాడు-నేడు పనులలో వేగవంతం చేసేందుకు ఎం. ఈ. ఓ లు, ఇంజనీర్లు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. పాఠశాలల్లో అన్నీ మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుచున్నదని, ఉపాధ్యాయులు విద్యాప్రమాణాల పెంపు పై దృష్టి సారించాలని, ఈ దిశగా ఎం.ఈ.ఓ లు కృషి చేయాలని తెలిపారు. ప్రతి పాఠశాలకు ర్యాంకింగ్ ఇచ్చే విధంగా అకడెమిక్ పర్ఫార్మన్స్ ను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో భాగంగా నాడు-నేడు క్రింద చేపట్టిన పనులను సంబందింత వెబ్ సైటు నందు అప్ లోడ్ చేయుట లో గల టెక్నికల్ ప్రాసస్ కు సంబందించిన సందేహాలు , సందేహాలపై అడ్వైజర్స్ (infra) మురళి నివృత్తి చేశారు.
జిల్లాలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని ప్రాథమిక విద్య పైన దృష్టి సారించి సత్ఫలితాలు తీసుకుని వచ్చేందుకు అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం జరుగుచున్నదని, నాడు-నేడు క్రింద చేపట్టిన పనులను పూర్తి నాణ్యతతో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ముఖ్య కార్యదర్శికి వివరించారు.