రాజమహేంద్రవరంలో ఉగ్ర గోదావరి...


Ens Balu
3
Rajahmundry
2020-08-16 18:37:37

రాజమహేంద్రవరంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలంలో మూడో ప్రమాదహెచ్చరిక జారీచేయడంతో ఇటు రాజమహేంద్రవరంలో కూడా గోదారమ్మ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. రైలు కం రోడ్డు వంతెనకు కేవలం 15 అడుగుల మేర మాత్రమే ఖాళీవున్నట్టుగా వరద ప్రవహాం వస్తోంది. ఈ రాత్రికి మరింతగా వరదనీరు వచ్చే అవకాశాలున్నాయి అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి నదిలోకి ఇతర పాయల నుంచి కూడా వరద నీరువచ్చి చేరుతుండటంతో గోదారమ్మ ఉగ్రరూపం దాలుస్తోంది. మరోవైపు గోదావరి లంక ప్రాంతాల వారిని, లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాకినాడ కలెక్టరేట్ తోపాటు, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి రెవిన్యూ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొచ్చినా తక్షణమే సహాయక చర్యలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఎన్డీ ఆర్ఎఫ్ బ్రుందాలను కూడా సిద్దం చేశారు. పరిస్థితిపై కలెక్టర్ మురళీధర రెడ్డి ఎప్పటికప్పుడు రెవిన్యూ అధికారులతో మాట్లాడుతున్నారు.