వైజాగ్ స్టీల్ పరిరక్షణ కోసం మరో పాదయాత్ర..
Ens Balu
1
Visakhapatnam
2021-02-16 13:09:29
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయం విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ వినూత్నంగా నిరసన తెలియజేస్తూవచ్చింది. ఇపుడు ఏకంగా మరోసారి జనాల్లోకి స్టీలు ప్లాంట్ విషయాన్ని తీసుకెళ్లేందుకు రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ఫిబ్రరి 20న మరో పాదయాత్ర చేపడుతున్నారు. ఈమేరకు 22 కిలోమీటర్లు జరిగే ఈ పాద యాత్రలో విశాఖలోని అన్ని నియోజకవర్గాలను కలుపుకొని ఈ పాదయాత్ర చేపట్టనున్నారు. 20వ తేదీ ఉదయం 8.30 గంటలకు విశాఖలోని జీవిఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం పాదయాత్ర సాగనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా సిద్దమైంది. ఈ పాదయాత్రకు అన్ని కార్మిక సంఘాలు కూడా సంఘీబావం తెలియజేశాయి. ఈ పాదయాత్ర అనంతరం ప్రధాని నరేంద్రమోడీని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని కోరనున్నారు. స్టీలుప్లాంట్ ప్రైవేటీకరణను నిరశిస్తూ సాగే ఈ పాదయాత్రలో అత్యధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, పలు పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.