స్టీల్ పరిరక్షణయాత్రలో ప్రజలు పాల్గొనాలి..
Ens Balu
2
Visakhapatnam
2021-02-16 17:03:27
"స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ వాయిస్ వినిపించడానికి 20వ తేదీన పాదయాత్ర చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు". మంగళవారం పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.. ఈనెల 20వ తేదిన నిర్వహించే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట మహా పాదయాత్రలో నగర ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలన్నారు. మొత్తం 22 కిలోమీటర్లు సాగే పాదయాత్ర నగరంలోని అన్నినియోజకవర్గాలను కలుపుకుంటు యాత్ర కొనసాగుతుందన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేట్ వరకు పాదయాత్ర జరుగుతుందన్నారు..వైఎస్సార్సీపీ మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుందన్న మంత్రి దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారని గుర్తుచేశారు..స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తాము ముందు ఉండి పోరాడతామన్నారు..మాతో వచ్చే వారిని కలుపుకుంటు ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటికే కార్మిక సంఘాలు మాతో కలిసి వచ్చే పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలియజేశారు. మేము చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంటే చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేట్టన్నారు. నారా లోకేష్ కు రాష్ట్ర ప్రయోజనాలు కంటే రాజకీయ ప్రయోజనలు ముఖ్యమన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దీక్ష చేస్తుంటే సంఘీభావం తెలపడానికి వచ్చిన లోకేష్ ప్రక్కనే దీక్ష చేస్తున్న కార్మికులనే కలవలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీకి లేఖ రాయాలన్నారు. చంద్రబాబుకి లేఖ రాసే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు ఓర్పుని టీడీపీ వాళ్ళు పరీక్షించవద్దు హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని ఎదో సాధించాలని చూశారని కానీ దానికి ప్రజలు సరైన సమాధానం ఇచ్చారన్నారే విషయాన్ని టిడిపి గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, బాబురావు ,మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయ కర్తలు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.