అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి..


Ens Balu
2
Srikakulam
2021-02-16 18:09:03

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం జరగనున్న మూడవ దశ పంచాయతీ ఎన్నికలలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు.  మూడవ దశ ఎన్నికలు జిల్లాలోని ఆమదాలవలస, పాలకొండ మరియు రాజాం నియోజకవర్గాలలో గల  ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని, రేగిడి మండలాల్లోని 293 పంచాయతీలు, 2,648 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ఈ విడతలో 3లక్షల 77వేల 867 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా కలెక్టర్ చెప్పారు. వీరంతా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటు వేసేందుకు అర్హులని, తమ పంచాయతీ జాబితాలో ఉన్న వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందన్న సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. గ్రామ పంచాయతీలో జరిగే ఈ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం కలుగుతుందన్న విషయాన్ని ప్రతీ ఓటరూ గుర్తించి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.