పాఠశాలకు ప్రొజెక్టర్లు బహూకరణ..


Ens Balu
2
Visakhapatnam
2021-02-16 18:29:52

విద్యకు సాంకేతికతను జోడించి, బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. విఎస్‌ఇజెడ్‌లోని హోబెల్‌ ‌బిల్లోస్‌ ‌కంపెనీ నిర్వాహకులు, ఏయూపాలక మండలి సభ్యులు వి.ఎస్‌ ఆం‌జనేయ వర్మ డిజిటల్‌ ‌క్లాస్‌రూమ్‌కు అవసరమైన స్క్రీన్‌, ‌ప్రొజెక్టర్‌లను మంగళవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ద్వారా వడ్లపూడి ప్రాధమిక  పాఠశాల ప్రతినధులకు బహూకరించారు. 15 డిజిటల్‌ ‌క్లాస్‌రూమ్‌లకు అవసరమైన ఉపకరణాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి మెరుగైన బోధనతో విద్యార్థుల్లో సమగ్ర అవగాహన కల్పించడం సాధ్యపడుతుందన్నారు. సంస్థ ప్రతినిధులను అభినందించారు.