బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టండి..సీపీఎం


Ens Balu
3
Visakhapatnam
2020-08-17 14:42:26

బిజెపి ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 20 నుండి 26 వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఎం ఆలిండియా కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం విశాఖలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ 16 డిమాండ్లతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ సదర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.‌కె.ఎస్‌.‌వి.కుమార్‌లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ రెండొవ సారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని కారుచౌకగా కార్పొరేట్‌, ‌ప్రైవేట్‌ ‌కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. ప్రజలందరూ కరోనా వైరస్‌తో ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవల్సింది పోయి వారిపై తీవ్రమైన దాడి చేస్తుందన్నారు. ప్రస్తుత కష్టకాలంలో ప్రజలందరికీ నెలకి రూ. 7,500/-లు ఆరు నెలల పాలు ఇవ్వాలని, ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం, ఆహార వస్తువులు ఇవ్వాలన్నారు. లాక్‌డౌన్‌ ‌కాలానికి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని, ఉపాధి హామీ పధకాన్ని 200 రోజులు పని కల్పించాలని, పట్టణాలు కూడా ఉపాధి హామీని అమలు చేయాలని, కార్మిక చట్టాలు రద్దు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ  వైద్యాన్ని బలోపేతం చేయాలని, కార్పొరేట్‌ ‌హాస్పటల్స్ ‌దోపిడీని అరికట్టాలని, అసంఘటిత రంగ కార్మికులైన భవన నిర్మాణం, ఆటో, తోపుడుబండ్లు, కాంట్రాక్టు, దినసరివేతన కార్మికులందరికీ పనులు కల్పించాలని,  రైతులకు హానిచేసే 3 ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20వ తేదీ నుండి 26 వరకు విశాఖలో అన్ని సచివాలయాలు, వార్డు, మండల కార్యాలయాలు వద్ద నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు బి.జగన్‌, ‌జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.