3వ దశ ఎన్నికలు చక్కగా జరుగుతున్నాయి..


Ens Balu
3
Srikakulam
2021-02-17 15:20:41

శ్రీకాకుళం జిల్లాలో మూడవ దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎన్నికల పరిశీలకులు సిహెచ్.శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆమదాలవలస మండలం తొగరాంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు స్వయంగా పర్యవేక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడవ విడతలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు.  జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్నికల ఏర్పాట్లను పక్కాగా చేశారని కితాబు ఇచ్చారు. పోలింగ్ అయిన వెంటనే వీలైనంత త్వరగా కౌంటింగ్ జరగాలని, పోలింగ్ అయిన రోజు రాత్రికే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేలా అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. ప్రజలు, అధికారుల సమన్వయంతో ఓటింగ్ శాతం పెరిగిందని వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారని తెలిపారు. గడచిన రెండు దశల్లో 85 శాతం ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని, మూడవ దశలో కూదా అంతే స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.