తడిసిన విద్యుత్ స్థంబాలను తాకవద్దు..పోలాకి
Ens Balu
3
Visakhapatnam
2020-08-17 15:39:31
రాష్ట్రవ్యాప్తంగా గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణగా విద్యుత్ స్థంబాలు, స్టార్టర్ లు పూర్తిగా తడిసి ఉన్నాయని, వాటిని ఎవరూ పొరపాటున కూడా తాకి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు పిలునిచ్చారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు సురక్షితంగా ఉండాలన్నారు. ఇంట్లో కూడా విద్యుత్ ప్లగ్ లు పెట్టే సమయంలోనూ తడిచేతులతో తాకవద్దని చెప్పారు. అలాగే మీ ఇంటికి సంంధించిన సర్వీస్ వైర్లని కాని వాటితో వెలాడే ఇనుపతీగలను కానీ కరెంట్ స్తంభాలను,ఇనుప స్తంభాలను ముట్టుకొనే ప్రయత్నం చేయవద్దని కోరారు. దయచేసి విద్యుత్ షాక్ తో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలన్నా అయన ఏదైనా సమస్య వుంటే మా దృష్టికి తీసుకురావాలని పోలాకి కోరారు.