కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ కి పదోన్నతి..
Ens Balu
4
Vizianagaram
2021-02-18 18:51:58
విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్‌కు పదోన్నతి లభించింది. ఆయనకు ప్రభుత్వ కార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శి కమ్ కమిషనర్ స్థాయిని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచీ కలెక్టర్‌కు సూపర్ టైమ్ స్కేల్ వర్తించనుంది. 2005 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మన జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్‌తోపాటు, ఇదే బ్యాచ్‌కు చెందిన మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వీరిలో ఇంతకుముందు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఎంఎం నాయక్, పి.భాస్కర్, కె.శారదాదేవి తదితర ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ప్రభుత్వ కార్యదర్శిగా పదోన్నతి లభించిన కలెక్టర్ హరి జవహర్ లాల్‌ను పలువురు రాష్ట్రస్థాయి అధికారులతోపాటు, జిల్లా అధికారులు అభినందించారు.