విశాఖను నెంబర్1 స్మార్ట్ సిటీ చేయడమే నా లక్ష్యం..


Ens Balu
4
Visakhapatnam
2021-02-18 19:03:31

మహావిశాఖనగరపాలక సంస్థను దేశంలోనే నెంబర్ వన్ స్మార్ట్ సిటీగా అభివ్రుద్ధిచేయడమే తనముందున్న లక్ష్యమని జివిఎంసీకి నూతనంగా నియమితులై కమిషనర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి జివిఎంసీకి కమిషనర్ గా పంపిందని ప్రజాప్రతినిధులు, మీడియా, ప్రజల సహకారంతో విశాఖ నగరాన్ని మరింత అభివ్రుద్ధి చేస్తామన్నారు. నిరుపేదల సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసి ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డా.సన్యాసిరావు, ఇతర విభాగాల అధికారులు కమిషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులను పరిచియం చేశారు.