ఆమె రాకతో జివిఎంసీ ఇక గాడిలో పడినట్టే..
Ens Balu
1
Visakhapatnam
2021-02-18 20:47:22
ఆంధ్రప్రదేశ్ లోనే ప్రముఖ నగరంగా ఉన్న మహావిశాఖనగర పాలక సంస్థను గాడిలో పెట్టాలని ప్రభుత్వం భావించింది..అలాంటి మున్సిపల్ కార్పోరేషన్ ను దైర్యంగా ముందుకి నడపాలంటే అంతే స్థాయి తెగువ వున్న ఐఏఎస్ అధికారిని నియమించాలి. ఇక్కడికి ఎంత మంది అధికారులు వచ్చినా ఏదో పనిచేశామన్నట్టుగా వ్యవహరించేవారు తప్పతే ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలనే తపన తక్కువగానే ఉండేది. ఇక లాభం లేదనుకున్న ప్రభుత్వం ఒక మంచి ఐఏఎస్ అధికారిణిని నియమిస్తే జీవిఎంసీ స్వరూపం మొత్తం మారుతుందని భావించి యువ ఐఏఎస్ అధికారిణి ఎస్.నాగలక్ష్మిని జివిఎంసీ కమిషనర్ గా నియమించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రతిష్టాత్మక పోస్టుకి అంతే స్థాయి అధికారిణి నాగలక్ష్మి ఐఏఎస్ అని చెప్పొచ్చు. ఆమె డ్యూటీ ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. పరిపాలనను ఒక సిస్టమేటిక్ గా చేసే ఐఏఎస్ అధికారుల్లో ఈమె కూడా ఒకరు. అలాంటి అధికారి తప్పితే మరెవరూ విశాఖనగరపాలక సంస్థకు సూట్ కారనుకున్న ప్రభుత్వం ఏరి కోరి ఈమెను కమిషనర్ గా నియమించింది. మొన్నటి వరకూ ఏపీఈపీడిసిఎల్ కి సీఎండీగా వ్యవహరించిన ఈమెను ప్రభుత్వం మళ్లీ విశాఖలోనే నియమించిందంటేనే ఈమె యొక్క పరిపాలనా దక్షత ఏస్థాయిదో ఇప్పటికే చాలా మందికి అర్ధమైపోయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో గానీ, ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు చేయడంలో గానీ ఈ అధికారిణి చేసే విధినిర్వహణ ఎంతో చక్కగా వుంటుంది. చాలా కాలం తరువాత జివిఎంసీకి మంచి ఐఏఎస్ అధికారిణి కమిషనర్ గా రావడంతో ఇక ప్రభుత్వం కూడా విశాఖను దేశంలోనే మంచి స్మార్ట్ సిటీల్లో నెంబర్ వన్ గా నిలబెట్టే బాధ్యతను ఈమెకు అప్పగించింది. దానికి తోడు ఈ అధికారిణి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే జివిఎంసీ అదనపు కమిషనర్ డా.సన్యాసిరావు లాంటి అధికారులు కూడా ప్రభుత్వ పాలనకు ఎంతో ఉపయోగ పడనుంది. జివిఎంసీ కమిషనర్ గా నాగలక్ష్మి ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రతీ ఒక్కరినోట నుంచి వెలువడిన మాట ఒక్కటే ఇక జీవిఎంసీ గాడిలో పడినట్టేనని..మంచి ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంలో ఉంటే అనుకున్న లక్ష్యాలను అదిగమించడం పెద్ద కష్టమేమీ కాదనడంలో సందేహమేలేదు. ఇక మహావిశాఖ నగరపాలక సంస్థలో ప్రజలతోపాటు ప్రభుత్వం కూడా మంచి ఫలితాల కోసమే ఎదురుచూడాలి..!