మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వర్తించాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-02-18 20:51:13

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థకు మార్చి నెలలో జరుగబోయే ఎన్నికలను నిర్వర్తించుటకు అధికారులు సమిష్టి కృషితో పని చేయాలని జి.వి.యం.సి. కమిషనరు నాగలక్ష్మి. ఎస్. ఆదేశించారు.  గురువారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో పాత సమావేశ మందిరం నందు కమిషనరు సమీక్షా సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరు మాట్లాడుతూ, గత సంవత్సరంలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడినందున, తదుపరి మార్చి నెలలో జరుపవలసిన ఎన్నికల ప్రక్రియలపై అధికారులతో చర్చించారు.  ఎన్నికలకు సంబందించిన స్ట్రాంగ్ రూమ్ లు, బ్యాలట్ బాక్షులు, పోలింగు సామగ్రి, వాహనాలు, మౌళిక సదుపాయాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, స్టేషనరీ సామగ్రి మొదలగు విషయాలపై జోన్ల వారీగా అధికారులతో చర్చించారు.  ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలని సూచించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన పనులపై వివరణ కోరగా ప్రధాన ఇంజనీరు ఎం. వెంకటేశ్వర రావు  మాట్లాడుతూ జరుగనున్న ఎన్నికలకు సంబంధించి జోన్ల వారీగా స్ట్రాంగు రూములు ఏర్పాటు చేస్తున్నామని, 1712 పోలింగ్ స్టేషన్లకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ, 204 రూట్లకు సంబంధించి కావలసిన వాహనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ పోలింగు స్టేషన్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం కమిషనరు మాట్లాడుతూ ఈ ఎన్నికల ప్రక్రియలో పోటీ చేస్తూ మరణించిన అభ్యర్ధుల వివరాలపై నివేదిక సమర్పించాలని అదనపు కమిషనరు ఎ.వి.రమణి ని ఆదేశించారు. అలాగే ఈ ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా విధులు నిర్వహించాలని, అందుకు కావలసిన టైం షెడ్యూల్ ను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రధాన ఇంజనీరు ఎం. ఎం. వెంకటేశ్వర రావు, అదనపు కమిషనర్లు పి. ఆశాజ్యోతి, ఎ. వి. రమణి, డా. వి. సన్యాసిరావు, వ్యయ పరిశీలకులు మంగపతిరావు, జె. డి. (అమృత్) – విజయభారతి, సి.సి.పి. విద్యుల్లత, పి.డి. యు.సి.డి. వై. శ్రీనివాస రావు, సి.యం.ఒ.హెచ్. డా. కె.ఎస్. ఎల్. జి. శాస్త్రి, పర్యవేక్షక ఇంజనీర్లు వినయకుమార్, శాంసన్ రాజు, కె.వి.యెన్.రవి, అందరు జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.