రూ.12.65 లక్షల ఊరగాయ విరాళం..
Ens Balu
3
Tirumala
2021-02-18 20:54:55
గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన విజయ ఫుడ్ ప్రాడక్ట్స్ అధినేత కె.రాము టిటిడికి రూ.12.65 లక్షలు విలువైన ఊరగాయలు విరాళంగా అందించారు. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం ఈ ఊరగాయలను టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. వీటిలో 7 రకాల 4,500 కిలోల ఊరగాయలు, 300 కిలోల పసుపు పొడి, 200 కిలోల కారం పొడి, 300 కిలోల పులిహోర పేస్ట్ ఉన్నాయి. అన్నదానం డెప్యూటీ ఈవో నాగరాజ, క్యాటరింగ్ అధికారి జిఎల్‌ఎన్.శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.