స్టీల్ ప్లాంట్ పరిరక్షణ యాత్ర జరుగుతుందిలా..
Ens Balu
3
Maddilapalem
2021-02-19 11:54:57
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మన జాతి సందైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణను నిరశిస్తూ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి శనివారం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర యొక్క రూట్ మేప్ ను వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ విడుదల చేశారు. పాదయ యాత్ర విశాఖ జివిఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ప్రారంభమై స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద ముగుస్తుంది. ఈ మేరకు పాదయాత్ర ➡️ మహాత్మా గాంధీ విగ్రహం ➡️ ఆసిల్ మెట్ట జంక్షన్ ➡️సంగం శరత్ ➡️కాళీ టెంపుల్ ➡️తాటి చెట్ల పాలెం ➡️ఊర్వశి జంక్షన్ ➡️104 ఏరియా ➡️ మర్రిపాలెం ➡️ ఎన్ఏడి జంక్షన్ ➡️ ఎయిర్ పోర్ట్ ➡️ షీలా నగర్ ➡️ B.H.P.V ➡️ పాత గాజువాక ➡️ శ్రీనగర్ ➡️ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ (కూర్మం పాలెం జంక్షన్) వరకూ సాగుతందని చెప్పారు. ప్రాంతాల వారీగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమాను, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పాటుపడేవారంతా ఈ పాద యాత్ర పాల్గొన వచ్చునని వంశీ వివరించారు.