పైడితలమ్మకు పూజలు చేసిన కలెక్టర్..
Ens Balu
2
Vizianagaram
2021-02-19 16:26:19
విజయనగరం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ శుక్రవారం పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనకు ప్రభుత్వ కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతోనే తనకు పదోన్నతి లభించిందన్నారు. గత మూడేళ్లుగా జిల్లా అభివృద్ధికోసం చేపట్టిన పనులన్నింటికీ అమ్మవారి ఆశీస్సులే కారణమన్నారు. జిల్లా ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు వుండాలని తాను ప్రార్ధించినట్టు చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో తాను వృత్తిపరంగా కూడా ఎంతో విజయం సాధించగలిగానని పేర్కొన్నారు. తనకు ఈ జిల్లాకి అవినాభావ సంబంధం ఏర్పడిపోయిందని, అదంతా అమ్మవారి దయతోనే జరిగిందని అభిప్రాయపడ్డారు.