విశాఖ బ్రాంచి అధ్యక్షునిగా మురళీక్రిష్ణ..


Ens Balu
3
Visakhapatnam
2021-02-19 17:17:04

ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, దక్షిణ భారత సమాఖ్య విశాఖపట్నం బ్రాంచ్, 2021-22 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు విశాఖలో జరిగిన నూతన కార్యవర్గ ఎన్నికల్లో బ్రాంచ్ చైర్మన్ గా  సిఎ. ఎస్. మురళీ కృష్ణ,  వైస్ చైర్మన్ గా, కోశాధికారిగా సిఎ. జి. వాసుదేవ మూర్తి ,  సెక్రటరీగా సిఎ. ప్రశాంత్  కుమార్ పండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమాఖ్య అధ్యక్షులుగా సిఎ. ప్రశాంత్ కుమార్ పండా నియమితులయ్యారు.  కార్యవర్గసభ్యులుగా సీఎ.  వి.రామ ప్రసాద్,  సీఏ. వై.సూర్యచంద్ర  రావు, సీఏ. ఎం చలపతి రావు, సీఏ. జి భారతి దేవి కొనసాగుతారు. ఈ సందర్భంగా చైర్మన్ సీఏ. మురళీ కృష్ణ  మాట్లాడుతూ, తన కార్యాచరణ ప్రణాళికలో ఛార్టర్డ్ అకౌంటెంట్స్ కు ఉపయోగపడే పలు సదస్సులు, జి ఎస్ టి పన్నుపై పలు అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని, సీఏ విద్యార్థులకు పలు కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజల కోసం కూడా అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంధ్రా యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్  వి కృష్ణ మోహన్  మోహన్ గారు.  గౌరవ అతిధి  గా సీఏ. సి.వి. ఎస్.మూర్తి, గౌరవనీయు అధ్యక్షులుగా జాతీయ  కార్యవర్గ  సభ్యులు,ఎక్సఫీసియో సభ్యులు సీఏ. డి.ప్రసన్నకుమార్  హాజరయ్యారు.