వైఎస్సార్సీపీలో చేరిన టిడిపి యువత..


Ens Balu
3
Visakhapatnam
2021-02-19 18:51:09

విశాఖలోని కొత్తవెంకోజిపాలెం జీవీఎంసీ 15వ వార్డ్ నడింపల్లి రేవతి కృష్ణంరాజు ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. శుక్రవారం విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, విశాఖ తూర్పు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు విజయ్ కుమార్ పార్టీలోకి చేరిన కార్యకర్తలను, నాయకులను సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి  అంటే ఎనలేని అభిమానమని, ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమను పార్టీలోకి చేరేలా చేశాయని వారంతా అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి తామంతా చైతన్యవంతం అయ్యామన్నారు. ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివ్రుద్ధికి కొత్తవెంకోజి పాలెంలో శక్తివంచన లేకుండా పనిచేసి వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని యువత  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు వైఎస్సార్సీపీ యువత, నాయకులు పాల్గొన్నారు.