మన్యంలో ఎన్నికలు విజయవంతం చేయాలి..


Ens Balu
3
Paderu
2021-02-19 19:00:03

ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయగలిగామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామల పేర్కొన్నారు.శుక్రవారం స్దానిక కాఫీ హౌస్ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ముందు చూపు,చొరవతో మన్యంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పెద్ద ఎత్తున కసరత్తు చేసారన్నారు. ప్రతీ మండలాలనికి ప్రత్యేకాధికారులను నియమించారన్నారు. అదేవిధంగా నలుగురు ఐ ఎస్ అధికారులను ఏజెన్సీకి పంపించి నిత్యం పర్యవేక్షించేలా ఆదేశించారన్నారు. పోలీసులు చేపట్టిన మూడంచల భద్రతా చర్యలు,బందోబస్తు ఏర్పాట్లు చేసిన చింతపల్లి ఎస్ ఎస్‌పి విద్యాసాగర్‌నాయుడు, పాడేరు డి ఎస్ పి విబి రాజ్‌కమల్ సేవలు,పోలీస్ సిబ్బంది సేవలను కొనియాడారు. రెవెన్యూ, మండల అభివృధ్ది అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి పి ఎస్ కుమార్ సేవలను గుర్తించి అభినందించారు. పాడేరు ఆర్ డి ఓ కె. లక్ష్మి శివ జ్యోతి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సహకారంతో మైదాన ప్రాంతంతో పోలిస్తే మన్యంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో విజయవంతంగా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసామని అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో చింతపల్లి ఎస్ పి విద్యాసాగర్ నాయుడు, డి ఎస్‌పి రాజ్‌కమల్, డి ఎల్ పి పి ఎస్ కుమార్, ఐటిడి ఏ పరిపాలనాధికారి కె. నాగేశ్వరరావు, 11 మండలాల తాహశీల్దారులు, ఎంపిడి ఓలు తదితరులు పాల్గొన్నారు.