నాడు నేడు పనులు వేగవంతం కావాలి..


Ens Balu
3
Srikakulam
2021-02-19 21:32:11

నాడు నేడు పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. నాడు నేడు పనుల ప్రగతిపై మండల అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. పనులు త్వరగా పూర్తి చేసి పాఠశాలలను సిద్ధం చేయాలని స్పష్టం చేసారు. ఇంకా పనులు జాప్యం కారాదని ఆయన అన్నారు. 1216 పాఠశాలల్లో పనులు ఇప్పటికే చేపట్టగా 536 పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి కాలేదని అన్నారు. 880 గ్రీన్ చాక్ బోర్డులు, 440 టివిలు అందుబాటులో ఉన్నాయని వాటిని వారం రోజుల్లో బిగించి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. టివిలు బిగించడం వలన ఇంగ్లీషు లాబ్ లు సిద్దం కాగలవని పేర్కొన్నారు. 120 పాఠశాలల్లో తాగునీటి సరఫరా సామగ్రి తక్షణం బిగించాలని ఆదేశించారు. మేజర్, మైనర్ మరమ్మతులు, మరుగుదొడ్ల పనులు విధిగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు. పూర్తి చేసిన పనుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ కనెక్షన్లు, పెయింటింగ్ వివరాలు అప్ లోడ్ చేయాలని అన్నారు. ఈ వీడియో సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా విద్యాశాఖ అధికారి కె.చంద్రకళ,  పంచాయతీ రాజ్ ఎస్ఇ భాస్కరరావు, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, ఇడబ్ల్యుఐడిసి ఇఇ కె.భాస్కరరావు, సమగ్ర శిక్షా అభియాన్ ఎపిసి పివి రమణ, ఇఇ వి.వెంకట కృష్ణయ్య, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.