కనకమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి..
Ens Balu
4
Visakhapatnam
2021-02-20 13:36:11
ఉత్తరాంధ్రవాసుల ఇలవేల్పు విశాఖ వాసుల కుల దైవం శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని శనివారం హైకోర్టు న్యాయమూర్తి సి.ప్రవీణకుమార్ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి న్యాయమూర్తికి దర్శన ఏర్పాట్లు చేశారు. న్యాయమూర్తి దంపతులు అమ్మవారిని దర్శించుకొని కొంతసేపు ఆలయంలోనే గడిపారు. అనంతరం అమ్మవారి తీర్ధ ప్రసాదాలను దేవస్థానం అధికారులు అందజేశారు. అంతకుముందు వేదపండితులు న్యాయమూర్తి దంపతులకు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.