జీవీఎంసీకి 400 హోమ్ క్వారంటైన్ కిట్ల విరాళం..
Ens Balu
2
Visakhapatnam
2020-08-17 20:16:16
కరోనా వైరస్ ఉద్రుతి అధికంగావున్న సమయంలో రోటరీ క్లబ్ అందించే సహాయం మరువలేనిదని జీవిఎంసీ కమిషనర్ స్రిజన అన్నారు. సోమవారం రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ కెప్టెన్ ఆర్ఎస్ కాళీప్రసాద్ జీవిఎంసికి 400 హోమ్ క్వారంటైన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, విశాఖ జీవిఎంసి పరిధిలో సుమారు 1000 క్వారంటైన్ కిట్లు కావాల్సివుందన్నారు. రోటరీ ద్వారా అందిన కిట్టు 40శాతం రోగులకు సరిపోతాయని చెప్పారు. రోటరీ కెప్టెన్ మాట్లాడుతూ, రోటరీ ద్వారా ప్రతీఏటా ఏదోఒక సేవా కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కరోనా సమయంలో రోగులకు ఉపయోగపడేవిధంగా హోమ్ క్వారంటైన్ కిట్లు అందజేయడం జరిగిందని వివరించారు. రాజున్న రోజుల్లో కూడా తమ సేవలు కొనసాగిస్తామని కమిషనర్ కి వివరించారు. కార్యక్రమంలో జివిఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కెఎస్ఎల్జి శాస్త్రి, రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ కార్యదర్శి రోటేరియన్ విఠల్ ప్రసాద్,విశాఖపట్నం కెమిస్ట్స్ సొసైటీ అధ్యక్షుడు బగ్గం శ్రీనివాస రావు, వైజాగ్ వాలంటీర్స్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.