ఆదర్శ ప్రాయమైన వైద్య సేవలు అందించాలి
Ens Balu
3
శ్రీకాకుళం
2020-08-17 20:29:14
ఆదర్శ ప్రాయమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిజి డాక్టర్లు, హౌస్ సర్జన్లను కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ జెమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్ భారీన పడిన వారికి అందుతు న్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లతో సమావేశం నిర్వహిస్తూ వైద్య వృత్తి గౌరవప్రదమైనదన్నారు. ఈ వృత్తిలో ప్రవేశించడం సేవానిరతికి సూచకమని కలెక్టర్ అ న్నారు. గొప్ప వృత్తిలో ఉన్నారని, మంచి సేవలు అందించాలని కోరారు. కరోనా సమయంలో సేవలను అందించడం చారిత్రాత్మకమని కలెక్టర్ చెప్పారు. ప్రతి వ్యక్తికి వైద్యాన్ని అందించి వారూ సంతోషంగా ఇం టికి చేరాలని తద్వారా వారి హృదయాలలో నిలుస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ కృషి చేసి వైద్య సేవలను అందించి కరోనా నుండి సమాజాన్ని బయట పెట్టాలని ఆయన చెప్పారు. జిల్లాలో వైద్య సేవలు మ రింత మెరుగ్గా చేయాలని ఆయన సూచించారు. మౌలిక వసతుల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, వైద్యులు తమ సేవలను అందించాలని కోరారు. ఈ సమయంలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమైనదని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరికి మంచి వైద్య సేవలు అందించి ఆదర్శంగా నిలవాలని కోరారు.