మున్సిపల్ ఎన్నికలకు సిద్దం కావాలి..


Ens Balu
3
Srikakulam
2021-02-22 16:53:09

శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ (ఎస్.ఇ.సి) ఎన్.రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎస్.ఇ.సి వీడియో కాన్ఫరెన్సును  నిర్వహించింది. మునిసిపల్ షెడ్యూల్ అందిరికి తెలిసే విధంగా ప్రదర్శించాలని అన్నారు. మునిసిపల్ ఎన్నికలకు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి వాటిని సమర్పించాలని ఆదేశించారు. పోలింగు కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని, అచ్చట తాగు నీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, విద్యుత్ తదితర సదుపాయాల లభ్యతను పరిశీలించాలని పేర్కొన్నారు. కోవిడ్ నియమ నిబంధనలు విధిగా అమలు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను దిగ్విజయంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటిండెంట్లను ఆయన ప్రశంసించారు.  ఈ వీడియో కాన్ఫరెన్సులో పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, శ్రీకాకుళం నగర పాలక సంస్ధ కమీషనర్ పల్లి నల్లనయ్య, డిప్యూటి కలెక్టర్లు బి.శాంతి, సీతారామయ్య, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు, మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ ఎం.కిరణ్ కుమార్, మునిసిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.