సమన్వయంతోనే ఎన్నికలు నిర్వహణ..


Ens Balu
3
Visakhapatnam
2021-02-22 21:22:58

మహావిశాఖనగర పాలక సంస్థకు జరిగి ఎన్నికల విషయంలో నోడల్ అధికారులు సంబందిత జోనల్ కమిషనర్లతో సమన్వయం చేసుకొని విధుల్లో పాల్గొనాలని కమిషనర్ ఎస్.నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జివిఎంసీ ఎన్నికలకు సంబంధించిన  విధి విధానాలపై ఆయా అధికారులతో జివిఎంసి సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, నోడల్ అధికారులు జివిఎంసి ఎన్నికలు ఒక క్రమ పద్దతిలో నిర్వహించేందుకు గాను వారికి కేటాయించిన పనులు పూర్తిచేయడానికి గాను రూట్ మ్యాప్ తయారుచేసుకొని ఇతర అధికారులతో సమన్వయం చేసుకొని విధులు పూర్తి  చేయాలన్నారు.  జోనల్ కమిషనర్లు కనీసం నాలుగు పర్యాయాలు అయినా ఆయా జోనల్ పరిధిలో గల పోలింగు స్టేషన్లను పరశీలన చేయాలన్నారు. బ్యాలట్ బాక్సులను సమకూర్చుకొని, వాటికి ఆయిల్ సర్వీసు, రిపేర్లు నిర్వహించి, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంచాలని సంబందిత జోనల్ అధికారిని ఆదేశించారు.  ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తూ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఫ్లైయింగ్ స్క్యాడ్ లు  ఏర్పాటు చేసి ర్యాలీలు, సమావేశాలు ఇతర సంఘటనలుపై వీడియోలు, ఫోటోలు తీయించాలన్నారు. రిటర్నింగ్ అధికారి నుంచి మొదలుకొని పోలింగు స్థాయి సిబ్బంది వరకు అందరికి క్రమ బద్ధంగా శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. దీనికోసం ఎక్కువమంది మాష్టర్ ట్రైనీలను ఏర్పాటు చేసుకొని పలు ప్రధాన ప్రాంతాలలో సిబ్బందికి శిక్షణా  కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున, సాధ్యమైనంతవరకు ఈ నెలాఖరులోపు చేపట్టవలసిన పనులు పూర్తిచేయాలని జోనల్ కమిషనర్లకు నోడల్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జివిఎంసి ఎన్నికల నోడల్ అధికారులు, జోనల్ కమిషనర్లు, ఎలెక్షన్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.