సరుకుల పంపిణీ విజయవంతం కావాలి..


Ens Balu
3
Chittoor
2021-02-23 14:55:07

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా  రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమం మొబైల్ వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం పట్టణ ప్రాంతాల్లో 43% పూర్తి చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్( రెవిన్యూ) మార్కండేయులు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్ ప్రజా పంపిణీ వ్యవస్థ పై వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ సరుకులు పంపిణీ ప్రజల వద్దకే తీసుకెళ్లి ఇవ్వాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని భావంతో కొంత మందికి ఉపాధి కలిగించే గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం మొబైల్ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 2 శాతం మంది మొబైల్ వాహనదారులు కొంత ఇబ్బంది పెడుతున్నారని అయితే ముందే దీన్ని గ్రహించిన ప్రభుత్వం ధరలు పెంచడం కూడా జరిగిందన్నారు. మొబైల్ వాహనదారుడు ఒక సహాయకుని నియమించు కోవాలని వారు వీఆర్వోలు వాలంటీర్లు సూచనల మేరకు ప్రజలకు నిత్యావసర వస్తువులు ప్రభుత్వం ఇచ్చేవి అందజేయాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో వాలంటీర్లు మొబైల్ వాహనం డ్రైవర్లు కొత్త కావడం వల్ల కొంత ఆలస్యం జరుగుతోందని వీరికి వీఆర్వోలు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందని వారికి రెండు నెలల లోపు పని నేర్పిస్తే అనంతరం జిపిఎస్ విధానం ద్వారా పి ఆర్ వో లు ఎక్కడ ఉన్నా సిస్టం ను మానిటరింగ్ చేసుకోవచ్చునని కమిషనర్ తెలిపారు. ఏదైనా ఒక కొత్త పద్ధతిని తీసుకు వచ్చినప్పుడు మొదట సమస్యలు ఉంటాయని అదే విధంగా ప్రస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్థ కొంత ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది వాహనదారులు సహాయకులను నియమించు కోకుండా సమస్యలు తీసుకురావడం జరిగిందని ఆ సమస్యలు కూడా ప్రస్తుతం పరిష్కారమయ్యే దిశగా అందరూ కృషి చేస్తున్నారన్నారు. ప్రజలకు అనుకూలమైన సమయాల్లోనే నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని వేసవి కాలం వస్తోందని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం ప్రజలకు అనుకూలమైన సమయం నుంచి ప్రారంభించుకోవచ్చు నని సాయంత్రం ఆరు గంటల నుంచి 7 గంటల వరకు గ్రామ సచివాలయం వద్ద వాహనాలు ఉండేలా చూడాలని మొదటి నెలలో కొన్ని సమస్యలు రావడం జరిగిందని రానున్న కాలంలో ఈ సమస్యలను అధిగమించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మొబైల్ నుంచి ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర వస్తువులను ప్రజలకు అందజేయాలన్నారు. ఇక వాహనాలకు సంబంధించి మెయిన్ స్కేల్ ఈపాస్ యంత్రాలు వాటికి సంబంధించిన చార్జర్ లు వాహనంలో ఉన్న సమయంలో వాహనం ద్వారా లేదా ఇంటి వద్ద ఉన్నప్పుడు వేరే ఛార్జర్ ద్వారా చేయాలని లేకుంటే  చార్జర్లు పేలిపోయే ప్రమాదముందని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా మెయిన్ స్కేల్ విషయంలో గాని ఈపాస్ యంత్రం మరమ్మతు కు గురైతే జిల్లా కేంద్రంలో ఉండే మెకానిక్ ద్వారా సరి చేసుకోవాలన్నారు మెకానిక్ ను ఇతర ప్రాంతాలకు పంపడం వల్ల వేరే ప్రాంతంలో యంత్రం చెడిపోతే సమస్య వస్తుందని అందువల్ల జిల్లా మేనేజర్ కార్యాలయం లో కానీ సివిల్ సప్లై అధికారి కార్యాలయంలో గానీ మెకానిక్ ఉండేటట్లు చూడాలన్నారు. వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ 18 రోజులపాటు చేయాలని విఆర్ఓ వాహనదారులకు పని నేర్పించిన తర్వాత వారు తిరిగి రెగ్యులర్ విధులకు హాజరు కావచ్చునని ఆయన తెలిపారు. రోజువారి రేషన్ సరుకులు పంపిణీ ఈ కార్యక్రమాన్ని తాసిల్దార్ లు ఆర్ డి వో లు జాయింట్ కలెక్టర్ పౌరసరఫరాల శాఖ వారు సమీక్షించాలని రోజు జాయింట్ కలెక్టర్ నివేదిక చూడాలని అన్నారు. పేద ప్రజల కోసం వారు ఇబ్బందులు పడకుండా వారు కూలీలకు వెళ్ళే సమయం ఉదయం ఉంటుంది కాబట్టి వారిని సంప్రదించి వారికి అనుకూలమైన సమయంలో వాహనం పంపాలని కార్డులకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియను వీఆర్వోలు చూడాలన్నారు. ఇలా మ్యాపింగ్ ప్రక్రియల సమస్యలు వస్తే పరిష్కరించేందుకు వీలుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు తాము మానేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఇందుకు సంబంధించి కొంతమంది అడగడం జరిగిందని అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు తర్వాత సీనియార్టీ లిస్టు లో ఉన్నవారికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందని మరో నాలుగు రోజుల్లో నిర్దేశించిన టార్గెట్లను చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా నెట్వర్క్ సమస్య వస్తే సరిచూసుకొని ఆన్లైన్ విధానం ద్వారా  పంపిణీ చేయవచ్చునని తెలిపారు . జాయింట్ కలెక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన ఏడు వందల ఇరవై నాలుగు వాహనాలు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో రేషన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తో పాటు చిత్తూరు ఆర్డీవో రేణుక ,జిల్లా పౌరసరఫరాల అధికారి శివరాం ప్రసాద్, జిల్లా మేనేజర్ మోహన్ బాబు, సోమయాజులు జిల్లా వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, తాసిల్దార్లు పాల్గొన్నారు.