ఎన్నికల కౌంటింగ్ కి పక్కాగా ఏర్పాట్లు..


Ens Balu
3
Vizianagaram
2021-02-23 15:00:34

విజయనగరం జిల్లాలో మార్చ్ 14 న  నిర్వహించనున్న నగరపాలక సంస్థ ఎన్నికల  కౌంటింగ్ ప్రక్రియ కు కట్టు దిట్ట మైన  ఏర్పాట్లు చేయాలని  జిల్లా కలెక్టర్ మరియు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి డా. హరి జవహర్లాల్ పేర్కొన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రమైన రాజీవ్ క్రీడా ప్రాంగణాన్ని   ఆయన సందర్శించారు. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ,ఇతర అధికారులతో రాజీవ్ స్టేడియం ను సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియ అనుకూలతలను వివరించే రూట్ మ్యాప్ ను నగరపాలక సంస్థ అధికారులు కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్  మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి   10వ తేదీన ఎన్నికలు, 14వ తేదీన  కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నామన్నారు. ఫలితాలు త్వరగా వెలువడేలా  సిబ్బందిని, టేబుళ్ల ను , డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.   కేంద్రం లో  నాలుగు వైపులా సి సి కెమెరాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ను , తాగు నీరు, డస్ట్ బిన్ లను  ఏర్పాటు చేయాలని కమీషనర్ వర్మ కు సూచించారు.  కౌంటింగ్   ఏజెంట్ల కోసం  ఐ.డి కార్డులని జారీ చేయాలన్నారు.  కేంద్రం వద్ద  వాహనాల పార్కింగ్, భోజన ఏర్పాట్లకు అనువైన స్థలాన్ని గుర్తించి మార్కింగ్ చేయాలన్నారు.   గ్రౌండ్ వాటరింగ్ చేయాలని, గాలరీ ని పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు.   ఈ  కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏ సి పి వెంకటేశ్వరరావు, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి, టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, నగర సర్వేయర్ సింహాచలం  తదితరులు పాల్గొన్నారు.