కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ కు ఘన సత్కారం..
Ens Balu
2
Vizianagaram
2021-02-23 20:11:17
ప్రభుత్వ కార్యదర్శి హోదా పొందిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్‌ను, వివిధ స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ఫోరమ్ ఫర్ బెటర్ విజయనగరం ఘనంగా సన్మానించింది. కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఫోరమ్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వెంకటేశ్వర్రావు, కె.ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని కలెక్టర్‌ను అభినందించారు. శాలువలతో సత్కరించి, జ్ఞాపికలను అందించారు. ఆయన జిల్లాకు చేసిన సేవలను కొనియాడారు. ముఖ్యంగా హరిత విజయనగరంగా మార్చేందుకు కలెక్టర్ చేసిన కృషిని మరోసారి గుర్తు చేశారు. హరిజవహర్ లాల్ పేరు జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిఉంటుందని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ కోశాధికారి బిహెచ్ సూర్యలక్ష్మి, ఛాంబర్ ఆఫ్ కామర్స్, రోటరీ క్లబ్, రోటరీ ఇంటర్నేషనల్, మన ఊరు విజయనగరం, లిఫ్టింగ్ హేండ్స్, కౌముదీ పరిషత్, సాగి సీతారామరాజు కళాపీఠం, క్రెడయ్, ఇన్నర్ వీల్ క్లబ్, గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం, ఐఎంఏ, బార్ అసోసియేషన్, లయిన్స్ క్లబ్, హొటల్స్ అసోసియేషన్, హూమన్ రైట్స్, థెరిసా క్లబ్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తదితర సంస్థల ప్రతినిధులు ఎస్ఎస్ఎస్ఎస్‌విఆర్ ఎం రాజు, శివ, డాక్టర్ పద్మకుమారి, గౌరీశంకర్, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.