జివిఎంసిలో కంట్రోల్ కేంద్రం ఏర్పాటు..
Ens Balu
3
Visakhapatnam
2021-02-23 20:22:26
విశాఖలోని జివిఎంసి కి మార్చి నెలలో ఎన్నికలకు సంబంధించి ప్రధానకార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కమిషనర్ నాగలక్ష్మి సెల్వరాజన్ చెప్పారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు సంబందించి ఏమైనా ఫిర్యాదులు ప్రజలు చేయాలనుకుంటే నేరుగా క్రింది తెలియజేసిన నెంబర్లకు నేరుగా ఫోన్ ఈ క్రింది తెలిపిన టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ కు గాని ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు అందించవచ్చని తెలియజేశారు. ప్రధాన కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్లు : 1800 4250 0009, ల్యాండ్ లైన్ నెంబర్ 0891 2869122 లేదా 0891 2869123 ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.