స్ట్రాంగ్ రూమ్ లకు పటిష్ట బందోబస్తు..


Ens Balu
3
Vizianagaram
2021-02-23 20:27:47

విజయనగరం జిల్లాలో మార్చి 14న  నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల  కౌంటింగ్ ప్రక్రియకు కట్టు దిట్ట మైన  ఏర్పాట్లు చేయాలని పార్వతీపురం ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు.  మంగళవారం పార్వతీపురం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను   ఆయన సందర్శించారు. అనంతరం   ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ  మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి   10వ తేదీన ఎన్నికలు, 14వ తేదీన  కౌంటింగ్ ప్రక్రియ జరుగునని, ఫలితాలు త్వరగా వెలువడేలా  సిబ్బందిని, టేబుళ్ల ను , డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం లో  నాలుగు వైపులా సి సి కెమెరాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ను , త్రాగు నీరు   ఏర్పాటు చేయాలని కమీషనర్ కు  సూచించారు. అలాగే బ్యాలెట్ బాక్స్ లు  పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి విధులు సజావుగా నిర్వహించాలని హితవు పలికారు. ఈ పర్యవేక్షణా కార్యక్రమానికి పార్వతీపురం మునిసిపల్ కమిషనర్ కె.కనక మహా లక్ష్మి,, సబ్ ఇన్స్పెక్టర్ కళాధర్, మునిసిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.