మీసేవకై వస్తున్నా ఆదరించండి..గెలిపించండి..


Ens Balu
4
Visakhapatnam
2021-02-24 13:04:04

విశాఖ ప్రజలకు సేవచేసుకునే అవకాశాన్ని కల్పించాలని మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పోరేటర్ అభ్యర్ధిగా మీ ముందుకు వస్తున్నానని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. బుధవారం విశాఖలోని 21వార్డులోని తమిళ వీధి, నేతాజీ వీధి, ఎల్ఎంఎం చర్ఛ్, ప్రాంతాల్లో వంశీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలకు మేలు చేయడానికే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. మన ఉత్తరాంధ్రా అభివ్రుద్ధికోసం రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని ప్రజలకు వివరించారు. మీ కుటుంభ సభ్యునిగా ఆదరించి ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. వంశీ ప్రచారానికి వెళ్లే ప్రాంతాల్లో మహిళలు బ్రహ్మరదం పడుతూ, హారతులు పట్టి ఆత్మీయంగా ఆహ్వానాలు పలికారు. ఎక్కడికి వెళ్లినా మీవెంట మేమున్నామంటూ మహిళలు భరోసా ఇస్తున్నారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ పెద్దలు, వార్డ్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున వంశీ యువసేన సభ్యులు పాల్గొన్నారు.