ధాన్యం సేకరణకు కంట్రోల్ రూం..
Ens Balu
3
Srikakulam
2021-02-24 14:50:54
శ్రీకాకుళంజిల్లాలో ధాన్యం సేకరణకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వివిధ కారణాల రీత్యా ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరగలేదని అన్నారు. రైతులు ధాన్యం విక్రయించుటకు జిల్లా కేంద్రంలోను, సంబంధిత మండలాలలోను కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంట్రోల్ రూం 7075839959, 7075439959 ఫోన్ నంబర్లకు రైతులు ధాన్యం సమాచారం అందించవచ్చని ఆయన వివరించారు. వీరఘట్టం, పాలకొండ, బూర్జ మండలాలతో ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా ధాన్యం విక్రయించే రైతుల వివరాలు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.