శభాష్ డాక్టర్ కృష్ణ చైతన్య..


Ens Balu
2
Srikakulam
2021-02-24 14:53:51

అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, తన తనయుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యలతో మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లాలోపంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ  మద్దతుదారులు అత్యధికశాతం విజయం సాధించిన విషయాన్ని సీఎం ద్రుష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పంచాయతీల పోరులో పార్టీ మద్దతుదారులను గెలిపించడంలో క్రుషిచేసి మంత్రి, మంత్రి తనయుడిని అభినందించారు.టీడీపీకి బాగా పట్టున్న చోట్ల కూడా వైయస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందడం, ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసాన్ని చూపిస్తుందని చెప్పారు. అదేవిధంగా నరసన్నపేట నియోజకవర్గంలో మెజారిటీ పంచాయతీలను వైఎస్సార్సీపీ మద్దతుదారులే చేజిక్కించుకునేలా యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య చేసిన ప్రణాళికాబద్ధమైన కృషిని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సీఎం జగన్ కు ప్రత్యేకంగా వివరించారు. నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలో 115 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలవగా, టీడీపీ మద్దతుదారులు కేవలం 20 పంచాయతీలకు మాత్రమే పరిమితమయ్యారని సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యని శభాష్ డాక్టర్ అంటూ సీఎం అభినందించారు.