ముంపు ప్రాంతాల వారికి తక్షణ సహాయం చేయాలి..సోము
Ens Balu
3
Polavaram
2020-08-18 15:28:30
పోలవరం ముంపు ప్రాంతాలు కోనసీమ లంక గ్రామాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి , ఎమ్మెల్సీ మాదవ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వేటుకురి సూర్యనారాయణ రాజు రెండు బ్రుందాలు ఏర్పాటై గ్రామాలను పర్యటించారు. ఈ సందర్భంగా సోము మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఎత్తి చూపిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ముంపు ప్రాంత ప్రజలకోసం ఏ ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. కాపర్ డాం ఎత్తు పెంచడం వల్లే లంక గ్రామాలకు పెద్ద ఎత్తున వరద నీరుచేరిందన్నారు. ఈ వరదల్లో తూర్పుగోదావరి జిల్లాలో దేవిపట్నం మండలం లో 23 లక్షల క్యూసెక్కుల నీరు అధికం గా చేరటం వల్ల గట్లు తెగిపడుతున్న ప్రభుత్వం విషయాన్ని ప్రభుత్వం దృష్టికితీసుకెలతానని స్థానికులకు హామీ ఇచ్చారు. ముంపు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ తరుపున తక్షణ సాయం 5వేలు అందే విధంగా చర్యలు చేపట్టాలకి ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.