16 మంది సాగర మిత్రాల నియామకం..


Ens Balu
4
Vizianagaram
2021-02-24 19:26:00

తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు  సహాయ పడేందుకు  రెండు తీర ప్రాంత మండలాలకు 16 మంది సాగర మిత్ర పోస్ట్ లను నియమించినట్లు సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు.   సంయుక్త కలెక్టర్(రెవిన్యూ), పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. నరసింహులు, మత్స్య శాఖ ఉప సంచాలకులు  నిర్మలా కుమారి  సభ్యులుగా గల కమిటి బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో   సాగర మిత్ర పోస్టల ఇంటర్వ్యూ లను  జరిపారు.  16 పోస్ట్ ల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 174 దరఖాస్తులు అందాయని, 1:3 నిష్పత్తి లో  48 మందికి కాల్ లెటర్స్ పంపగా 45 మంది హాజరైనారని, అందులోంచి  16 మందిని రోస్టర్ పాటిస్తూ మెరిట్ ప్రకారంగా ఎంపిక చేయడం జరిగిందని జే.సి తెలిపారు.  వీరికి ఒకటి రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారి చేయడం జరుగుతుందన్నారు.   వీరు తీర ప్రాంతల్లో పనిచేస్తూ, బోట్ల రిజిస్ట్రేషన్, ప్రభుత్వం నుండి మత్స్యకా రులకు  అందవలసిన సమాచారాన్ని అందించడం , పధకాల గురించి అవగాహనా కల్పించడం ,  మత్స్య సంపదను అంచనా వేయడం లోను మత్స్యకారులకు సహాయ పడతారని తెలిపారు.