ముంపు ప్రాంతాలను చూడబోయి గోదావరి మధ్యలోనే..


Ens Balu
1
kotipalli
2020-08-18 14:33:08

గోదావరి ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన పలువురు వైసీసీ నేతలు గోదావరి మధ్యలో పంటు నిలిచిపోవడంతో చిక్కుకుపోయారు.  కోటిపల్లి నుంచి ఆయినవిల్లి మండలంలో ముంపు గ్రామాలను పరిశీలించేందుకు పలువురు వైసీపీ నేతలు, మీడియా ప్రతినిధులు పంటులో బయలుదేరారు. అయితే కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారిలంక...వీరవల్లి పాలెం మార్గమధ్యలో అకస్మాత్తుగా ఇంజిన్‌కు రిపేర్ అవడంతో పంటు నిలిచిపోయింది. బోటు ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో పంటు అక్కడే నలిచిపోయింది. బోటులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మరి కొందరు మీడియా ప్రతినిధులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంటు రిపేరుకు ప్రయత్నిస్తున్నారు.