విశాఖలో తొలి ఆథార్ కేంద్రం అరకులోయలోనే..
Ens Balu
2
Araku Valley
2020-08-18 14:35:02
విశాఖ మన్యం అరకులోయ లో తొలి ఆధార్ కేంద్రం ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమశాఖ ప్రోజెక్టు మానిటరింగ్ యూనిట్ ఆధ్వర్యంలో రెంటల్ హౌసింగ్ కాలనీలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని అరుకు ఎంపీ జి.మాధవి, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల మంగళవారం ప్రారంభించారు. ఆధార్ నమోదు, చిరునామా మార్పు, ఫోటో,బయోమెట్రిక్ నమోదు, పేరు మొబైల్ ఈమెయిల్, ఆధారకార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో కి వచ్చాయి. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ మాట్లాడుతూ అరకులోయ, పాడేరు, పెడబయలు చింతపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆధార్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ టీఎస్పీ నిధులతో డుంబ్రిగుడ మండలం సాగర , అరకులోయ మండలం చినలబడు పంచాయతీ రైతులకు మామిడి, నేరేడు, సీతాఫలం, కరివేపాకు, బెండ,ఉల్లి విత్తనాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండల ప్రతేకాధికారి పి.హెచ్ ఓ జి.ప్రభాకరరావు, ఎంపిడివో జి.వి రాంబాబు, పి.ఎం.యూ.టి డబ్ల్యూ సి..పి.ఓ సంజాయ్ సిన్హా, ఇన్నోవేషన్ పీఓ అంజన, పి ఐ ఓ ఐటీడీఏ వెసివిల, స్పెషల్ కన్సల్టెంట్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.