జగనన్న పాలవెల్లువ లక్ష్యసాధనకు కృషి..


Ens Balu
3
Srikakulam
2021-02-25 21:21:41

జగనన్నపాల వెల్లువ లక్ష్య సాధనకు కృషి చేయాలని  జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.  గురువారం  బాపూజీ కళామందిరంలో నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న ఎ.పి. అమూల్ ప్రాజెక్ట్ జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై కన్వెర్జన్స్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, గార, నరసన్నపేట, శ్రీకాకుళం (6) మండలాల పరిథిలోని 139 గ్రామాలలో మొదటి విడతగా అమలు చేస్తున్న జగనన్నపాల వెల్లువ కార్యక్రమాన్ని నిర్దేశిత లక్ష్యాలతో పూర్తి చేయాలన్నారు.   అమూల్ పాల వెల్లువ కార్యక్రమానికి సంబంధించి డాటా ఎంట్రీ నిమిత్తం గ్రామానికి దగ్గరలోనే గది (రూమ్) ను ఐడెంటీఫై చేయాలని, విద్యుద్దీకరణ, ఇంటర్నెట్ సదూపాయాలు కలిగించాలని సంబంధిత ప్రత్యేక అధికారులను ఆదేశించారు.  తహశీల్దారులు, ఆర్.ఐ.లు, వెటర్నరీ డాక్టర్లు ప్రత్యేక అధికారులు సంయుక్తంగా పాల శీతలీకరణ కేంద్రాల యూనిట్లను గుర్తించాలన్నారు.   పాలశీతలీకరణ కేంద్రాలను ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మాణం చేయాలని తెలిపారు.  కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగించాలని, ఈ పథకం వలన కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు అవగాహన కలిగించాలన్నారు.  సోసైటీని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించాలని ఆన్ లైన్ ద్వారా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.  మంచి ఆరోగ్యవంతమైన ఆవులు, గేదెలను కొనుగోలు చేయాలన్నారు.  ట్యాగ్ వున్న పశువులను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. వాటిని వెటర్నరీ డాక్టర్లు సర్టిఫై చేయాలని తెలిపారు.  వాటికి ఇన్సూరెన్స్ చేయించాలని తెలిపారు.  ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసిన పశువుల ఆరోగ్య పరిస్థితిని గమనించుకోవాలన్నారు.   వై.ఎస్.ఆర్.చేయూత పథకానికి  45 నుండి 60 సం.లలోపు బి.సి, ఎస్.సి, మైనారిటీలు, వితంతువులు అర్హులని తెలిపారు.   లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగాను నిక్కచ్చిగాను చేయాలన్నారు.   అమూల్ సంస్థ  పాలను కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు.  దీని వలన లబ్దిదారులకు సుమారు అయిదు వేల రూపాయల వరకు అదనంగా ఆదాయం  వస్తుందని తెలిపారు.   మంచి ఆరోగ్యంతో కూడిన పశువులను కొనుగోలు చేయాలని వాటికి ట్యాగ్ లు వేయాలని తెలిపారు.  జె.సి.సుమీత్ కుమార్ మాట్లాడుతూ, వై.ఎస్.ఆర్. చేయూత దరఖాస్తులను బ్యాంకులు మార్చి 5వ తేదీలోగా  గ్రౌండ్ చేయాలన్నారు.             ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు,జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, పశు సంవర్ధక శాఖ సంయక్త సంచాలకులు వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంక్ మేనేజరు హరిప్రసాద్, ఎపిజివిబి, డిసిసిబి, కెనరా బ్యాంకు  మేనేజర్లు,  ప్రత్యేక అధికారులు, ఏ.పి.ఎం.లు,  తదితరులు హాజరయ్యారు.