ఎన్నికల కమిషన్ నియమాలు పాటించాల్సిందే..


Ens Balu
2
Visakhapatnam
2021-02-25 22:24:46

మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో పీఓలు, ఏపీఓలు పోలింగు విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు,జిల్లా ఎన్నికల అధారిటీ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం జి.వి.యం.సి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగు స్టేషన్లలో విధులు నిర్వహించవలసిన పోలింగు అధికారులకు, సిబ్బందికి వారి బాధ్యతలు, పోలింగులో తీసుకోవలసిన జాగ్రత్తలపై వి.ఎం.ఆర్.డి.ఎ. చిల్డ్రన్ ఎరీనాలో అదనపు ఎన్నికల అధారిటీ మరియు జి.వి.యం.సి. కమీషనరు నాగలక్ష్మి.ఎస్. తో కలసి జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అధారిటీ 55 మంది మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో కలెక్టరు మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరుపుటకు ప్రధాన ఘట్టం పోలింగు ప్రక్రియే అన్నారు.  ఈ పోలింగు ప్రక్రియ పూర్తిగా పోలింగు అధికారులపై ఆధారపడి ఉన్నందున వారికి ప్రత్యేకంగా పోలింగు విధి, విధానాలపై ఇప్పుడు శిక్షణ తీసుకుంటున్న మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇవ్వవలసివుంటుదన్నారు.  పోలింగు నియమ నిబంధనలు, సాదారణంగా చేసే పొరపాట్లు, పోలింగులో వచ్చే సమస్యలు, పరిష్కార మార్గాలపై పూర్తిగా వివరించాలని మాస్టర్ ట్రైనర్స్ ను కలెక్టరు ఆదేశించారు.   పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారికి పూర్తి అధికారాలు ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రంలో వారి నడవడి, వ్యవహారశైలి హుందాగా ఉండాలని, అనుమానాలకు ఆస్కారం ఇవ్వకూడదన్నారు.  బ్యాలెట్ బాక్స్  తెరవడం, సీలింగు,   ఏజెంట్ల నియామకం, పోలింగ్ కేంద్రం అమరిక, ప్రొఫార్మా లు, కవర్లు, ప్రిసైడింగ్ అధికారి డైరీ, సాధారణంగా వచ్చే పొరపాట్లు, క్షేత్రస్థాయిలో విధినిర్వహణ మొదలైన అన్ని విషయాలను క్షుణ్ణంగా బోధించి రిటర్నింగ్ అధికారి పోలింగ్ అధికారులను బలోపేతం చేయాలని కలెక్టరు ఆదేశించారు. నియమ నిబంధనలతో కూడిన హేండ్ బుక్స్ పి.ఓ.లందరికి అందేలా చర్యలు తీసుకోవాలని జోనల్ కమీషనర్లను ఆదేశించారు.  పోలింగ్ అనంతరం సంబంధిత మెటీరియల్ అప్పగించే వరకు పి.ఓ.లు, ఎ.పి.ఓ.లు తప్పకుండా ఉండాలన్నారు. బాక్స్ లు పూర్తిగా సీలింగ్ చేసిన తరువాత మాత్రమే పోలింగ్ కేంద్రం నుండి బయలుదేరాలని, పోలింగ్ స్టేషన్ లోనే సంబంధిత ఫారాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు.   ఎ.ఎస్.డి.లో (A – Absentees, S – Shifted, D – Dead అనగా ఓటరు స్లిపులు ఓటరుకు అందించినప్పుడు గుర్తించిన వివరాలు) ఉన్న వారు ఓటింగ్ కు వచ్చినపుడు పోలింగ్ అధికారి అన్నింటిని పరిశీలించాలని పేర్కొన్నారు.  మాస్టర్ ట్రైనర్లు ఉత్సాహంతో పోలింగ్ శిక్షణ ఇవ్వాలన్నారు.  పోలింగు ప్రక్రియ పూర్తయిన తరువాత పోలింగు ఏజెంట్లచేత తప్పకుండా సంతకాలను చేయించాలని మాస్టర్ ట్రైనర్ల కు కలెక్టరు సూచించారు.   అనంతరం జి.వి.యం.సి. కమీషనరు నాగలక్ష్మి.ఎస్.  మాట్లాడుతూ ఈ ఎన్నికల పోలింగు ప్రక్రియలో 2100 ప్రిసైడింగ్ అధికారులు, 2100 సహాయ ప్రిసైడింగ్ అధకారులుకు పోలింగు ప్రక్రియపై తరువుగా శిక్షణను 55 మంది మాస్టర్ ట్రైనర్స్ ఇవ్వవలసి ఉంటుందన్నారు.  మార్చి 1 వ తేదీన పి.ఒ.లకు, ఎ.పి.ఒ. లకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని  మాస్టర్ ట్రైనర్స్ ను కమీషనరు ఆదేశించారు.  పోలింగు అధికారులు పోలింగు సామాగ్రిని తీసుకుని, తరుచుగా తనిఖీ చేసుకొని పోలింగు స్టేషన్లకు వెళ్ళేటట్లు అవహాగాహన పరచాలని రిటర్నింగ్ అధికారులను, మాస్టర్ ట్రైనర్స్ ను కమీషనరు ఆదేశించారు. ముందుగా ఈ శిక్షణా కార్యక్రమంలో పోలింగు స్టేషన్లో బ్యాలట్ బాక్సు తెరవడం, పోలింగు అనంతరం సీలు చేయడం వంటి ప్రక్రియను ఆడియో, వీడియో రూపంలో జిల్లా పరిషత్ సి.ఇ.ఒ. వి. నాగార్జునసాగర్ చూపించి వివరించారు.  పోలింగు  స్టేషన్లో పోలింగు అధికారుల విధి, విధానాలపై, రిటర్నింగ్ అధికారుల బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సి.ఇ.ఒ. వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అదనపు కమీషనరు ఎ.వి. రమణి, డిప్యూటీ ప్రాజెక్టు అధికారి బి.వి. రమణి, జి.వి.యం.సి. సలహాదారు జి.వి.వి.ఎస్. మూర్తి, జోనల్ కమీషనర్లు, జోనల్ అధికారులు/ మేజిస్ట్రేట్ లు, రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.