అనంత దర్శిని చక్కగా సాగాలి..


Ens Balu
2
Anantapur
2021-02-26 19:22:32

'అనంత దర్శిని' జిల్లా ప్రత్యేకతలను వివరిస్తూ అసిస్టెంట్ కలెక్టర్లకు పరిపాలనపై అవగాహన యాత్రల చక్కగా సాగేలా చూడాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు.  2019 బ్యాచ్ అసిస్టెంట్ కలెక్టర్ల జిల్లా పర్యటన 'అనంత దర్శిని' కార్యక్రమంపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  మార్చి 6-8 తేదీలలో నిర్వహించనున్న ఈ పర్యటన విజయవంతం కావాలన్నారు. జిల్లాలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యాన పంటల వ్యవసాయంలో నూతన ఒరవడులు, తాగు నీటి సరఫరా, విద్యా రంగం, సంస్కృతి వంటి అంశాల గురించి శిక్షణలో ఉన్న అసిస్టెంట్ కలెక్టర్లకు తెలియజేయాలన్నారు. 2019 బ్యాచుకు చెందిన పది మంది అసిస్టెంట్ కలెక్టర్లకు 'ఏపీ దర్శన్' పేరిట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మొదటగా జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్లు పర్యటించనున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ల జిల్లా పర్యటనను 'అనంత దర్శిని'గా కలెక్టర్ గంధం చంద్రుడు నామకరణం చేశారు. 'అనంత దర్శిని' కార్యక్రమంపై తన ఛాంబర్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పర్యటన తేదీలను, సందర్శించే ప్రదేశాలను ఖరారు చేశారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్(రెవెన్యూ), ఏ.సిరి(అభివృద్ధి) మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.