సచివాలయ కార్యదర్శిలపై ఏసీబి నిఘా..


Ens Balu
2
తాడేపల్లి
2021-02-27 10:20:48

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ సచివాలయాలపై అవినీతి నిరోధక శాఖ ద్రుష్టిసారించింది..ఏక కాలంలో ఒకేసారి రెడ్ హేండెడ్ గా అక్రమార్కులను బుక్ చేయాలని మాస్టర్ స్కెచ్ వేసింది..దానికి కారణం కూడా లేకపోలేదు..వంద రూపాయలు కూడా లేని చలానా లేని పెళ్లి ద్రువీకరణ పత్రం(మేరేజ్ సర్టిఫికేట్ )కు దేవస్థానాల పరిధిలో ఉన్న గ్రామ సచివాలయాల కార్యదర్శిలు ఏకంగా మూడు వేల నుంచి 5వేల రూపాయల వరకూ అడ్డంగా దోచేస్తున్నారు. పెళ్లి జరిగిన వెంటనే కాకుండా నెల రోజుల లోపు సర్టిఫికేట్ కావాలంటే దానికి మరో రేటు పెడుతున్నారు కూడా. ఇటీవల కాలంలో చాలా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మ్యారేజ్ సర్టిఫికేట్ లు అవసరం పడటంతో చాలా మంది ముదర కార్యదర్శిలకు చేతినిండా పనిదొరకడంతోపాటు, అదే స్థాయిలో అక్రమాదాయానికి బాటలు వేసుకుంటున్నారు. వీరి చేతికి మట్టంటకుండా గతంలోని పంచాయతీలో పనిచేసే డైలీవేజ్ సిబ్బందిని, మరికొందరు బిల్ కలెక్టర్లను మధ్యవర్తులుగా పంపి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ల వ్యాపారం చేస్తున్నారు. దీనితో ఈ విషయం కాస్తా ప్రభుత్వం ద్రుష్టికి, ఏసీబి ద్రుష్టికి పలు దఫాలుగా ఫిర్యాదులు వెళ్లాయట. అదీ వారు ఎంత మొత్తం ఏ ఏ రకాల మేరేజి సర్టిఫికేట్లకు తీసుకున్నారో..ఎవరి ద్వారా తీసుకున్నారో తదతర పేర్లతో సహా ఫిర్యాదులు చేశారని సమాచారం. ఈ క్రమంలోనే  ప్రముఖ దేవస్థానాల పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాలపై నిఘా పెట్టారు.  రెండు మూడేళ్లలో ఉద్యోగవిరమణకు దగ్గర పడ్డ కార్యదర్శిలు మరింతగా తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. రిటైర్ మెంట్ దగ్గరపడ్డ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోదనే కారణంతో, దైర్యంతో వారంతీ ఇలాంటి సంపాదనకు తెరతీశారని తెలుస్తుంది.  ఇప్పటికే విశాఖజిల్లాలోని ఎస్.రాయవరం మండల కేంద్రంలోని ఒక ఈఓపీఆర్డీ సచివాలయ నిధులను నిధులను తమ కుటుంభ సభ్యుల ఖాతాలకు నేరుగా దారిమళ్లించుకున్న విషయమై కేసు రాష్ట్ర కమిషనరేట్ లో నడుస్తుంది. దానికి సంబంధించి విశాఖజిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్లు ఇద్దరూ సదరు కార్యదర్శిపై చర్యలకు ఉపక్రమించారు. నేరం రుజువైనా ఆయనపై చర్యలు తీసుకునే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో అదికాస్తా ఆలస్యం అయ్యింది. ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే ఆయనపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అరెస్టు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈయనతోపాటు మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిలపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా తేడాగా విధులు నిర్వహిస్తూ..అక్రమార్జనే ధ్యేయంగా పనిచేసే సచివాలయ కార్యదర్శిలపై నిఘా పెట్టిన ప్రభుత్వం, ఏసీబి త్వరలోనే వరుసపెట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అయినప్పటికీ తాము చేసిందే ఉద్యోగం, లంచాలు తీసుకున్నా తమను కాపాడటానికి తమపై స్థాయిలో ఎంపీడీఓలు ఉన్నారని బ్రమపడుతూ ఆమ్యామ్మాలు పుచ్చుకునే కార్యదర్శిలు, వారిని అన్ని పనుల్లోనూ వెనుకేసుకు వచ్చే ఎంపీడీఓలపైనా నిఘా పెట్టినట్టు కూడా సమాచారం వస్తుంది. ప్రజల ముంగిటే సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ, గతంలో పంచాయతీల్లో కార్యదర్శిలుగా చేసిన కొందరు సీనియర్లు తమ చేతివాటాన్ని మాత్రం ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉన్నారు. వీరి అక్రమార్జను అడ్డుకట్టవేయాలంటే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అక్రమార్కులపై చర్యలు తీసుకోడం ద్వారా మాత్రమే మార్పుతీసుకు రావడం సాధ్యపడుతుందని ప్రభుత్వం యోచిస్తుంది. అంతేకాకుండా కొత్తగా విధుల్లోకి చేరి సచివాలయ సిబ్బంది, కార్యదర్శిలు ఇతర విభాగాలకు చెందిన వారికి కనువిప్పు కల్పించాలని కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారట. అందులోభాగంగానే ఏకకాలంలో అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి తేడా సచివాలయ సిబ్బందిని పట్టుకొని చర్యలు తీసుకోనుందని సమాచారం. ప్రభుత్వం, ఏసీబి నిజంగా అలాంటి చర్యలు తీసుకుంటే చాలా మంది చేతివాటం ప్రదర్శించే సీనియర్ కార్యదర్శిలు అడ్డంగా పెద్దమొత్తంలో చిక్కే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని తెలుస్తుంది. గత 5నెలల్లో అందిన ఫిర్యాదులు కూడా ప్రభుత్వ ఆలోచనకు అద్ధం పడుతున్నాయి. ఏం జరుగుతుందో వేచిచూడాలి మరి..!